తమిళ హీరో కార్తీ నటించిన 'ఖైదీ' సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో ఓ స్పెషాలిటీ ఉంది. మామూలుగా సినిమా అంటే హీరో, హీరోయిన్, విలన్ పాత్రలను కీలకంగా చెప్పుకుంటాం. అయితే, ఈ సినిమాలో హీరో, విలన్ ఉన్నారు. కానీ హీరోయిన్ లేదు. కార్తీ గతంలో నటించిన 'ఖాకీ' సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌సింగ్ నటించిన సంగతి తెలిసిందే.
అయితే, కథలోని సీరియస్‌నెస్ కారణంగా హీరోయిన్ క్యారెక్టర్ అతికినట్లుగా లేదంటూ విడుదలయ్యాక ఆడియన్స్ నుండి వాదన వినిపించడంతో, అర్ధాంతరంగా సినిమా విడుదలయ్యాక హీరోయిన్ సీన్స్‌ని చాలా వరకూ కట్ చేసేశారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఎదురైందట. అయితే, ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన డైరెక్టర్ ఈ సినిమాకి అసలు హీరోయిన్‌నే తీసుకోలేదు. జైలు నుండి తప్పించుకున్న ఓ ఖైదీ కథ నేపథ్యంలో సాగిన ఈ సినిమా సీరియస్ మూడ్‌లో సాగుతుందట.
నెక్స్‌ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడిలోనూ నెలకొంటుందట. దాంతో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటే, రిలాక్స్ అయిపోయే అవకాశముంటుంది. దాంతో కథపై గ్రిప్ కోల్పోతామని భావించి స్క్రిప్టులో హీరోయిన్ రోల్ డిజైన్ చేయలేదు. కార్తీ అంటేనే సమ్‌థింగ్ డిఫరెంట్. హీరోయిన్ లేకుండా సినిమా అంటే బహుశా ఇదే తొలిసారి కూడా కావచ్చు. చూడాలి మరి, విత్ అవుట్ గ్లామర్ సోలోగా వస్తున్న కార్తి ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తాడో చూడాలిక.