ఈరోజు ఉదయం లేవగానే అందరిని ఒక్కసారిగా తన ట్వీట్ తో షాక్ కి గురిచేసిన మంచు మనోజ్, ఇప్పుడే ఆ ట్వీట్ ఎందుకు చేయవలసి వచ్చిందో అని అందరికి వివరంగా చెప్పాడు.
ఆ ట్వీట్ చేయడానికి గల అసలు కారణమేంటి అంటే- తన తరువాత చేయబోయే సినిమాల గురించి వినూత్నంగా చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇలా వెరైటీగా ట్వీట్ చేయడం వల్ల అందరు షాక్ కి గురయ్యారు అని చెప్పుకొచ్చాడు.
ఏదేమైనా ఈ మంచు వారబ్బాయి పేల్చిన ప్రాక్టికల్ జోక్ కి అందరు ఒక్కసారిగా అవ్వాక్కయ్యారు.