తమిళ సినిమా 'సంఘమిత్ర' నుండి హీరోయిన్‌గా ముద్దుగుమ్మ శృతిహాసన్ ఛాన్స్ వదిలేసుకున్న సంగతి తెలిసిందే. అలా శృతి హాసన్ ఆ సినిమా నుండి తప్పుకోవడంతో అది పెద్ద ఇష్యూ కూడా అయ్యింది .అయితే శృతి తప్పుకోవడంతో చిత్ర యూనిట్ ఆ ప్లేస్‌లో అనుష్కని అనుకున్నారు. ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్‌ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. చివరికి అనుష్కని ఫిక్స్ చేశారని సమాచారమ్ కూడా. అయితే అనుష్క ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టు 'భాగ్‌మతి'లో నటిస్తోంది. దాంతో అనుష్క ఈ సినిమాలో నటిస్తుందనే దానిపై అఫీషియల్ క్లారిటీ లేదు. సుందర్ సి దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా. 200 కోట్లకు పైనే బడ్జెట్ పెట్టనున్నారట. 'బాహుబలి' స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆర్య, జయం రవి ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. సినిమాకి బాలారిష్టాలు ఎదురవడం పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతోంది చిత్ర యూనిట్‌లో. కేన్స్‌లో సినిమా టైటిల్ లుక్‌ని విడుదల చేశారు. ఆ వెంటనే శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇదిలా ఉండగా కొత్తగా ఇప్పుడు నయనతార ఈ ప్రాజెక్ట్‌లో చేరనుందట. అయితే ఇది కూడా సస్పెన్సే. దాంతో ఇది అయినా ఖాయమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో పక్క శృతిహాసన్‌తోనే సమస్యలొచ్చాయి, నయనతారతో డీల్ చెయ్యడం ఇంకా కష్టం. ఏమో ఏమవుతుందో చూడాలిక.