మంచు ఫ్యామిలీ కాంబోలో మనోజ్, లక్ష్మి మిస్?

మరిన్ని వార్తలు

మంచు మోహన్ బాబు, విష్ణుల డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముఖేష్‌కుమార్‌ సింగ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ నటులు కన్నప్పలో భాగం అవుతున్నారు. అంతే కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ మూవీలో తిన్నని పాత్రలో నటిస్తుండటం విశేషం. కన్నప్పలో మంచు విష్ణు కొడుకు అవ్రామ్ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీలో మూడు తరాల వాళ్ళం కలిసి నటిస్తున్నట్లు విష్ణు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పడు మోహన్ బాబు ఇంకో విషయం కూడా అనౌన్స్ చేశారు.

తన మనవరాళ్లు, విష్ణు కూతుర్లు కూడా కన్నప్పలో నటిస్తున్నట్లు మోహన్ బాబు రివీల్ చేసారు. 'నా మ‌న‌వ‌రాళ్లు క‌న్న‌ప్ప మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. న‌ట‌న‌పై వాళ్ల‌కున్న అభిరుచి నాకెంతో గ‌ర్వంగా అనిపించింది. ఈ సినిమాతో వారికి మంచి గుర్తింపు రావాల‌ని, వారి ప్రయాణం చాలా మందిలో స్ఫూర్తి నింపాల‌ని కోరుకుంటున్నాను' అని మోహన్ బాబు తెలిపారు విష్ణు అరియానా, వివియానాల పుట్టినరోజు సందర్భంగా వారి ఫొటోస్ పోస్ట్ చేస్తూ కన్నప్పలో నటిస్తున్నట్టు అనౌన్స్ చేసారు. బర్తడే ని పురస్కరించుకుని కన్నప్పలో వారి లుక్ ని  రిలీజ్ చేసాడు. 'నా కుమార్తెలు క‌న్న‌ప్ప‌లో న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని మీతో పంచుకుంటున్న‌ప్పుడు నా హృద‌యం గ‌ర్వంతో ఉప్పొంగుతోంది. నా కూతుర్లు అద్భుతంగా న‌టించారు. హ్యాపీ బ‌ర్త్‌డే అరి, వివి అంటూ విష్ణు సోషల్ మీడియా ద్వారా విష్ చేసారు.

మొత్తానికి ఇది మంచు ఫ్యామిలీ కాంబో మూవీ అని తెలుస్తోంది. మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ఇంత మంది భాగం అయ్యారు. మరి మనోజ్, మంచు లక్ష్మి సంగతేంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. వారిద్దరూ నటించటం లేదా ? వారికి అవకాశం ఇవ్వలేదా ? నిజంగా మంచు ఫ్యామిలీ మధ్య ఇంతలా బేధాభిప్రాయాలు వచ్చాయా? లాస్ట్ కి కూతురుని కూడా దూరం పెట్టారా ? మోహన్ బాబు అని సందేహాలు మొదలయ్యాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS