బైక్ ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకుడు. సంయుక్త కథానాయిక. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకురానున్న నేపధ్యంలో తాజాగా ఈ ససినిమా టీజర్ ని వదిలారు. మైండ్ బ్లోయింగ్ బీజీఎం, సస్పెన్స్ క్రియేట్ చేసిన విజువల్స్, థ్రిల్ ఇచ్చే కంటెంట్ ఈ టీజర్ ఆకట్టుకుంది.
‘’చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి’’ అనే సాయి చంద్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేపింది. సమస్య కు ఏకైక పరిష్కారం మార్గం డైలాగ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడం, కొన్ని తంత్ర శక్తులు, డివైన్ ఎలిమెంట్స్.. ఇలా అన్ని క్యురియాసిటీని పెంచారు. ఒక టీజర్ చూసిన తర్వాత సినిమా తప్పకుండా చూడాలనే ఆసక్తి పెరగాలి. అలాంటి ఆసక్తి కలిగించిన టీజర్ విరూపాక్ష.