రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయిన మూవీ డ్రింకర్ సాయి. ఇందులో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. రియల్ గా జరిగిన కొన్ని ఇన్సిడెన్స్ ని తీసుకుని ఈ సినిమా రూపొందించినట్లు దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి స్పష్టం చేసాడు. ఈ మూవీపై రిలీజ్ ముందు నుంచి అంచనాలేర్పడ్డాయి. మిక్స్డ్ టాక్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న ఈ మూవీ దర్శకుడి పై తాజాగా దాడి జరిగింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందటంతో టీమ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో డైరక్టర్ కిరణ్ పై గుంటూరులో దాడి జరిగింది. డ్రింకర్ సాయి టీమ్ గుంటూరు లోని శివ థియేటర్ కు వెళ్లారు. థియేటర్ దగ్గర మీడియాతో మాట్లాడారు. అనూహ్యంగా కిరణ్ పై కొందరు దాడి చేసారు. కారణం డ్రింకర్ సాయి సినిమాలో మంతెన సత్యనారాయణని కించపరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయని నిరసనగా ఆయన ఫాన్స్ ఇలా దాడి చేసారు. అంతే కాదు ఆ సీన్స్ ని కట్ చేయాలనీ డిమాండ్ కూడా చేశారు. ప్రస్తుత ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నేచురోపతి డాక్టర్ గా ఫేమస్ అయిన మంతెన సత్యనారాయణకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మంతెన కృష్ణా, గుంటూరు కి చెందిన వాడు కావటంతో అక్కడి ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకున్నారు.
డ్రింకర్ సాయిలో క్యారెక్టర్ యాజ్ టీజ్ గా మంతెనని పోలి ఉండటం, ఆయన వైద్యాన్ని కించపరిచేలా సీన్స్ ఉండటంతో డైరక్టర్ పై దాడికి దిగారు. సినిమాను సినిమాలా చూడకుండా ఇలా వ్యక్తిగతంగా దాడి చేయటం కరక్ట్ కాదని టీమ్ వాదిస్తోంది. సినిమాలో పాత్రలు కల్పితాలు, ఎవరినీ ఉద్దేశించినవి కావని స్టార్టింగ్ లో చెప్పినా దాడి చేయటం కరక్ట్ కాదని పలువురు ఖండించారు. దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ సినిమాలో మంతెనని విమర్శించలేదని, యాదృచ్చికంగా అలా ఆ పాత్ర ఉండి ఉండొచ్చని తెలిపారు.
#DrinkerSai దర్శకుడు మీద దాడి చేసిన మంతెన సత్యనారాయణ అభిమానులు.. pic.twitter.com/xQ7JL6IQbZ
— Suresh PRO (@SureshPRO_) December 29, 2024