తండ్రి కామెడీ కింగ్‌ మరి కొడుకేమో.!

By iQlikMovies - September 07, 2018 - 11:41 AM IST

మరిన్ని వార్తలు

డాక్టరు కొడుకు డాక్టరే కావాలి. యాక్టర్‌ కొడుకు యాక్టరే కావాలి అనే రూల్స్‌ ఏమీ ఇప్పుడు లేవు. అందుకు లక్కు కలిసొస్తే తప్ప. అలాగే కమెడియన్‌ కొడుకు కమెడియన్‌ కావాలనేం లేదు. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్‌ కూడా అంతే. కామెడీ బ్రహ్మ వారసుడు అయినా తన రూటే సెపరేటంటూ భిన్న దారిలో ప్రయాణం చేస్తున్నాడు. హీరోగా విలక్షణ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. 

అయితే ఇంకా ప్లాట్‌ఫామ్‌ కరెక్ట్‌గా సెట్‌ కావడం లేదు. అప్పుడెప్పుడో 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో తెరంగేట్రం చేశాడు హీరోగా రాజా గౌతమ్‌. తొలి సినిమా కదా. చిన్న చిన్న తప్పులున్నా కొట్టుకెళ్లిపోయాయి. రాఘవేంద్రరావు టేకింగ్‌లో సినిమా రిచ్‌ లుక్స్‌తో ఓకే అనిపించింది. ఆ తర్వాత 'బసంతి' వంటి భిన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఆ సినిమాతో పెద్దగా రిజిస్టర్‌ కాలేదు మనోడు. అయినా కానీ విభిన్న కథాంశాలతోనే హీరోగా తన కెరీర్‌ కొనసాగిస్తానంటున్నాడు. 

తాజాగా 'మను' సినిమాతో వస్తున్నాడు. ఇది కూడా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీనే. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు. దాంతో ఈ ట్రైలర్‌ గురించి అంతా మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్‌తో ఏదో తెలియని ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసినా, చివరికి కన్‌ఫ్యూజన్‌లో పడేశాడు. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ ట్రైలర్‌ అర్ధమయ్యింది. 

ఇక ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలా తక్కువ బడ్జెట్‌తో చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేశారట. అంతేకాదు, బడ్జెట్‌ పెట్టిన విధానం కూడా సరికొత్తగా ఉంది. టెక్నీషియన్స్‌, ప్రొడ్యూసర్స్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతా ఈ సినిమా విషయంలో కొంచెం కొత్తగా ఆలోచించారు. ఎన్నో ఇంట్రెస్టింగ్‌ అంశాలతో రూపొందిన 'మను' ప్రేక్షకుల్లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలిక.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS