'పల్లకిలో పెళ్లికూతురు', 'బసంతి' చిత్రాలతో తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వస్తున్నాడు. ఈ సారి కొంచెం ప్రత్యేక తరహా చిత్రంతో వస్తున్నాడు. అదే 'మను' చిత్రం.
సైలెంట్‌గా 'మను' ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ విడుదలయ్యాక అందరి నోటా ఇదే మాట. ట్రైలర్ చూస్తుంటే ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తోంది. 'తీగ కొండికి వానపామును ఎర వేస్తారు. వానపామును చూస్తూ తీగని వదిలేస్తుంది చేప. ఇరుక్కుంటుంది ' అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆధ్యంతం ఆశక్తిగా సాగింది. ట్రైలర్‌లోని ప్రతీ డైలాగ్ ఆశక్తి రేకెత్తించేలా ఉంది. గౌతమ్ గుబురు గెడ్డంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. చాందినీ హీరోయిన్‌గా నటిస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ అనుభవం ఉన్న ఫణీంద్ర నారిశెట్టి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
మూడేళ్లు కష్టపడి ఈ చిత్రం కోసం కసరత్తులు చేసింది చిత్ర యూనిట్. కోటి రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి కావాల్సిన బడ్జెట్ అంతా డొనేషన్స్ రూపంలో వచ్చిందే. సో ఈ చిత్రం చాలా చాలా ప్రత్యేకం. మిస్టరీ రొమాన్స్ డ్రామాగా 'మను' రూపొందింది. ట్రైలర్‌తోనే ఇంత ఆశక్తి చూపించారంటే, ఇక సినిమాలో ఇంకెంత విషయం ఉంటుందోనన్న ఆశక్తి ఆల్రెడీ ఆడియన్స్‌లో నిండిపోయింది. జాన్ కోట్లీ, అభిరామ్, మోహన్ భగత్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సెప్టెంబర్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ రెండు చిత్రాలతో హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్న గౌతమ్‌కి 'మను' ఓ మంచి చిత్రం అవుతుందేమో చూడాలిక.