టాక్ అఫ్ ది వీక్- శ్రీనివాస కళ్యాణం & విశ్వరూపం 2

By iQlikMovies - August 12, 2018 - 13:49 PM IST

మరిన్ని వార్తలు

గతవారం విడుదలైన మూడు చిత్రాలలో రెండు చిత్రాలు హిట్ అవ్వడంతో ఈ వారం విడుదలైన చిత్రాల రిజల్ట్ పైన అందరి ఆసక్తి నెలకొని ఉంది.

 

ఇంతకి ఈ వారం విడుదలైన చిత్రాలు ఏంటంటే- శ్రీనివాస కళ్యాణం & విశ్వరూపం 2. ముందుగా శ్రీనివాస కళ్యాణం గురించి మాట్లాడుకుంటే- శతమానం భవతి టీం మరోసారి కలిసి చేసిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. విడుదలకి ముందు ఈ చిత్రం పైన చాలా హైప్ రావడం, అందులో నటించిన నటీనటులు కూడా చాలా గొప్పగా చెప్పేసరికి ఈ చిత్రం పైన అంచనాలు ఆకాశాన్ని అంటేసాయి.

ఇక చిత్రం విడుదలయ్యాక ఈ టాక్ మొత్తం మారిపోయి నెగటివ్ టాక్ రావడం జరిగింది. సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ ని ఒక “క్లాస్” లా మారిపోయింది అంటూ సినిమా చూసిన వారు ఫీలవుతున్నారు. చెప్పాలనుకున్న పాయింట్ ని సరైన పద్దతిలో చెప్పకపోతే జరిగే నష్టం ఈ సినిమాతో అర్ధమైతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రెండవ చిత్రం విశ్వరూపం 2, దాదాపు 5 ఏళ్ళ విరామం తరువాత విశ్వరూపంకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం పైన ప్రేక్షకులకి ఒక రకంగా ఆసక్తి చూపలేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం- ఈ నాలుగేళ్ళ విరామం రావడం ఇదే సమయంలో విశ్వరూపం 2 చిత్రాన్ని ప్రేక్షకుల్లో కచ్చితంగా చూడాలి అన్న ఫీలింగ్ ని తీసుకురాలేకపోయింది ఈ టీం అని చెప్పొచ్చు.

ఇక కథ విషయానికి వస్తే, మొదటి భాగంతో పోల్చితే రెండవ భాగం అంతగా ఇంటరెస్టింగ్ లేదు అని చెప్పొచ్చు. అదే సమయంలో మొదటి బాగంతో పోలిస్తే ఈ సారి కథనం విషయంలో కమల్ హాసన్ ఇంతకముందు రాసుకున్నంత పకడ్బందిగా సిద్ధం చేయలేకపోయాడు అని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

దీనితో లోకనాయకుడు కమల్ హాసన్ కి ఈ సీక్వెల్ చేదు అనుభవంగానే మిగిలిపోయింది అని చెప్పాలి.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS