మిస్ వరల్డ్ అంటే గ్లామర్‌కి ఏం లోటు అనుకోవడం సహజమే. మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని దక్కించుకున్న ముద్దుగుమ్మ మానుషీ చిల్లర్‌కి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అలా అని అందరికీ పరిచయస్థురాలు అని చెప్పలేం కూడా. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రకారును హీటెక్కించడం ఎలా? అనే కాన్సెప్ట్‌పై కసరత్తులు చేస్తోందనిపిస్తోంది. కొత్తగా హీటు పుట్టించేదేముంటుంది అనుకుంటున్నారా? చూసే కొద్దీ, చూడాలనిపించే అందాలుంటాయి కొంతమందిలో. అలాంటి అందమే మానుషీ చిల్లర్‌ది. ఈ బ్యూటీ లేటెస్టుగా హాట్ హాట్ ఫోటో సెషన్ చేయించుకుంది. హాట్ హాట్ అంటే నిజమే ఓ పక్క భానుడి తాపం. మరో పక్క మానుషీ అందాల తాపం అన్నమాట. అందమైన సముద్ర తీరం. హాట్ సన్ సెగలు ఓ పక్క కాక రేపుతుంటే, మరో పక్క వైట్ అండ్ బ్లాక్ బికినీలో కనీ కనిపించని మానుషీ అందాలు కేక పుట్టిస్తున్నాయి. రెండింటినీ ఒకేసారి తట్టుకోవడం కూసింత కష్టమే అయినా కానీ కానీ కాస్కోండి మరి.