'మహానటి' కోసం కీర్తి సురేష్‌కి కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ వెలకట్టలేని సినిమా ఇది.
ఈ సినిమాలో ప్రతీ పాత్ర కూడా అంతే. చాలా అరుదుగా నటీనటులకు ఇలాంటి పాత్రలు దక్కుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్‌కి. అందుకే కీర్తి సురేష్ పాత్రకు ఇంతా అంతా అని వెల కట్టలేము. మనసుకు నచ్చిన పాత్ర అది. కెరీర్‌లో అలాంటి పాత్రని కీర్తి మళ్లీ చేయలేదేమో. ఆ పాత్ర కోసం ఆమె పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది. అందుకే 'మహానటి'కి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఎన్ని విమర్శలైతే ఎదుర్కొందో అంతకు మించిన ప్రశంసలను దక్కించుకుంటోంది. ఎన్నో సినిమాలు చేస్తే కానీ రాని కీర్తిని ఈ ఒక్క సినిమాతో కీర్తి సురేష్ సంపాదించింది. ప్రబాస్‌కి 'బాహుబలి' ఎలాగో, కీర్తి సురేష్‌కి 'మహానటి' అలాగ అంటున్నారు. ఈ పాత్ర పోషించడం అనేది కత్తి మీద సామే. అలాంటి సాము చేసి విజయం సాధించింది కీర్తి సురేష్. తాజాగా ఈ సినిమాను తెలంగాణా మంత్రి కేటీఆర్ ఈ సినిమాని చూశారు. 'మహానటి' సినిమా చూసి దిమ్మ తిరిగిపోయింది. అంత అద్భుతమైన చిత్రం. నటీనటుల అద్భుత ప్రదర్శనకు హ్యాట్సాఫ్..' అని ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ఇకపోతే సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగిస్తోంది. ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా 'మహానటి' వసూళ్లు జోరుగా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు వసూళ్లను ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ 'మహానటి' అందులో కూడా జోరు ప్రదర్శిస్తోంది. ఏది ఏమైనా 'మహానటి'కి వెల కట్టలేం అదంతే.!