మారుతి మరోసారి అదరగొట్టేలా ఉన్నాడు.!

మరిన్ని వార్తలు

చిన్న సినిమాల డైరెక్టర్‌గా పేరు పొందిన మారుతి 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో ట్రెండ్‌ మార్చేశాడు. సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్నాడు. ఓ పక్క డైరెక్టర్‌గానూ, మరోవైపు సహ నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నాడు. 

తాజాగా మారుతి సమర్పణలో వస్తున్న సినిమా 'బ్రాండ్‌బాబు'. టీజర్‌ విడుదలైంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సుమంత్‌ శైలేంద్ర హీరోగా నటిస్తున్నాడు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌లో 'మాది చాలా పూర్‌ ఫ్యామిలీ.. మా నాన్నది టీ స్టాల్‌, నేను హోం మినిస్టర్‌ ఇంట్లో పనిమనిషిని, బస్తీలో పిల్లలకు చదువు చెబుతా..' అని ఈషా రెబ్బ చెబుతున్న డైలాగ్స్‌ హైలైట్‌గా నిలిచాయి. అందుకు 'ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా దీనింట్లోనే ఉన్నట్లు చెబుతుందేంట్రా..' అనే హీరో డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. 

అన్నీ బ్రాండెడ్‌ ఉండే ఆ హీరోకి ఈ పూర్‌ అమ్మాయికి మధ్య లవ్‌స్టోరీ ఎలా కుదిరింది? అనేదే కాన్సెప్ట్‌. టీజర్‌ని కాస్ట్‌లీగానే చూపించారు. మురళీశర్మ పాత్ర కీలకంగా కనిపిస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో విషయం ఉంటే, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. 

అలా ఈ 'బ్రాండ్‌ బాబు' సినిమా కూడా సక్సెస్‌ అవుతుందేమో చూడాలి మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS