సమంత-చైతులు పెళ్ళి తరువాత ఏం చేశారు?

మరిన్ని వార్తలు

అదేంటి సమంత-చైతుల పెళ్ళి జరిగి దాదాపు 10 నెలలు కావోస్తుంటే ఇప్పుడు వారు పెళ్ళి తరువాత ఏం చేశారు అని అడుగుతున్నారేంటి? అని అనుకోవద్దు.

ఇది వారిరువురు త్వరలో కలిసి చేయబోయే చిత్రానికి సంబంధించిన కథ అట. నిన్ను కోరి చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయిన దర్శకుడు శివ నిర్వాణ ఈమధ్యనే సమంత-చైతులని కలిసి ఈ చిత్ర కథని వినిపించారట.

ఆ కథ ప్రకారం, ఇద్దరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న జంట ఆ పెళ్ళి తరువాత ఎలా తమ జీవితాన్ని కొనసాగిస్తారు? ఎలాంటి గొడవలు పడతారు? ఇలా ఒక కొత్త పెళ్ళి జంట కి ఎదురయ్యే సంఘటనల నేపధ్యంలో ఈ సినిమా రూపొందనుందట. 

అయితే నిజజీవితంలో తమకి పెళ్ళయ్యాక కూడా మళ్ళీ చిత్రాలలో ప్రేమికులుగా నటించడం కంటే ఇలా పెళ్ళైన జంటగా చేస్తేనే ప్రేక్షకులకి చూడడానికి బాగుంటుంది అన్న అభిప్రాయం చైతుకి ఉందట. అది తెలిసే శివ ఈ కథని వీరిరువురి కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేశాడట.
త్వరలోనే ఈ చిత్రం మొదలవుతుంది అని తెలుస్తుంది. 

ఏదేమైనా.. ఈ రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ లో ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటారు అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS