లాక్‌డౌన్, థియేటర్ల మూత వల్ల... `మాస్టర్` విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి విడుదలైంది. లాక్ డౌన్ సమయంలో.. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు భారీగా వచ్చాయి. వంద కోట్లకు బేరాలు జరిగాయి. కానీ.. నిర్మాతలు ఒప్పుకోలేదు. ఈసినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తామన్నారు. అనుకున్నట్టే థియేటర్లో బొమ్మ పడింది. ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోనూ ఆడబోతోంది.
ఆమేజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కుల్ని కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 12 నుంచి ఈ సినిమాని అమేజాన్ లో చూడొచ్చు. దాదాపు 60 కోట్లకు ఈ సినిమాని అమేజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని టాక్. ఇది మంచి బేరమే. తెలుగులో `మాస్టర్` అంతంత మాత్రంగానే ఆడింది గానీ, తమిళనాడులో మాత్రం భారీ వసూళ్లు అందుకుంది. ఓవర్సీస్ లో కూడా మాస్టర్ తన ప్రతాపం చూపించింది.