సౌత్ ఇండియన్ కథలపై... మరోసారి దృష్టి పెడుతోంది బాలీవుడ్. ఈమధ్య మన కథలే అక్కడ రీమేకుల రూపంలో వెళ్తున్నాయి. ఇక్కడ హిట్టైన ప్రతీ సినిమానీ.. రీమేక్ చేయాలన్న దృష్టితోనే చూస్తోంది బాలీవుడ్. తాజాగా `మాస్టర్` వాళ్ల కంట పడ్డాడు. విజయ్ నటించిన సినిమా ఇది. సంక్రాంతికి విడుదలైంది. తెలుగులో ఫ్లాప్ టాక్ ఉంటే, తమిళంలో.. విజయ్ మానియా పనిచేసి, మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు.
సెవన్ గ్రీన్ స్టూడియోస్, సినీ వన్ స్టూడియోస్, ఎండ్‌మోల్ షైన్ ఇండియా.. సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా రీమేక్ చేస్తున్నాయి. అక్కడ.. హీరో ఎవరన్నది తేలాలి. దర్శకుడు కూడా మారొచ్చు. లొకేషన్ కనగరాజ్ చేతిలో మంచి ఆఫర్లున్నాయి. ఈ దశలో.. బాలీవుడ్ కి వెళ్లలేడు. ఓ స్టార్ దర్శకుడే ఈ రీమేక్ ని డీల్ చేసే అవకాశం వుంది. `మాస్టర్` గొప్ప కథేం కాదు. అదిరిపోయే ట్రీట్ మెంట్ ఏమీ ఉండదు. విలన్ పాత్ర బలంగా ఉంటుందంతే.
తమిళ నాడులో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. తెలుగులో మాత్రం ఫ్లాపే. ఇలాంటి కథని సైతం.. బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారంటే అక్కడ కథలకు అంత కరువుందన్నమాట.