రెడ్ జోన్ లోంచి బ‌య‌ట‌ప‌డిపోయింది

By iQlikMovies - January 19, 2021 - 18:28 PM IST

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది రెడ్‌. ఓ త‌మిళ హిట్ సినిమాకి రీమేక్ కావ‌డం, ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర‌వాత‌.. రామ్ నుంచి వ‌చ్చిన సినిమా కావ‌డంతో.. అంచ‌నాలు భారీగానే ఉండేవి. కానీ.. రెడ్ దాన్ని అందుకోలేక‌పోయింది. `త‌డ‌మ్‌` రీమేక్ రామ్ కి సెట్ కాలేద‌ని, రీమేక్ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని విశ్లేష‌కులు తేల్చేశారు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర‌వాత‌.. రామ్ స‌రైన క‌థ ఎంచుకోలేక‌పోయాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో `రెడ్‌`కి భారీ న‌ష్టాలు త‌ప్ప‌వేమో అనిపించింది. అయితే.. రెడ్ అనూహ్యంగా రెడ్ జోన్ లోంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. తొలి 4 రోజుల్లో దాదాపు 14.6 కోట్ల షేర్ తెచ్చుకుంది. ఓర‌కంగా.. ఇవి మంచి వ‌సూళ్లే.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 16 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఇంకాస్త ఓపిక ప‌డితే.. బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.

 

సినిమా అంత‌గా లేక‌పోయినా.. సంక్రాంతి సీజ‌న్ కావ‌డం, ఇస్మార్ట్ శంక‌ర్ ఇమేజ్ క‌లిసిరావ‌డం ఈసినిమాకి ప్ల‌స్ అయ్యాయి.  జ‌న‌వ‌రి 14నే వ‌చ్చిన `అల్లుడు అదుర్స్‌` తేలిపోవ‌డం కూడా.. క‌లిసొచ్చింది.

రెడ్ తొలి 4 రోజుల వ‌సూళ్లు ఇవే...


నైజాం: 4.90 కోట్లు

సీడెడ్: 2.45 కోట్లు

వైజాగ్: 1.39 కోట్లు

ఈస్ట్: 98 లక్షలు

వెస్ట్: 91 లక్షలు

గుంటూరు: 96 లక్షలు

కృష్ణా: 93 లక్షలు

నెల్లూరు: 58 లక్షలు

 

ఏపీ+తెలంగాణ 4 డేస్ కలెక్షన్స్ (షేర్): 13.10 కోట్లు
ఓవర్సీస్: 9 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 40 లక్షలు

వరల్డ్ వైడ్ టోటల్: 13.59 కోట్లు (షేర్)


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS