ఈ సంక్రాంతి సీజన్ కొన్ని సినిమాలకు బాగా కలిసొచ్చింది. పండగ సీజన్ కావడం, థియేటర్ లో సినిమా చూసి చాలా కాలం అవ్వడంతో.. టాక్ కాస్త అటూ ఇటుగా ఉన్నా, జనాలు థియేటర్ల దగ్గర వరుస కట్టారు. 50 శాతం ఆక్యుపెన్సీలోనూ, డివైడ్ టాక్ వచ్చినా కొన్ని సినిమాలు మంచి వసూళ్లనే అందుకున్నాయి. రెడ్.. బ్రేక్ ఈవెన్ వరకూ వెళ్లింది. మాస్టర్ కి అయితే ఏకంగా లాభాలొచ్చాయి. విజయ్ నటించిన డబ్బింగ్ సినిమా ఇది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. తొలి వారంలో ఈ సినిమాకి దాదాపు 13 కోట్ల గ్రాస్, షేర్ రూపంలో అయితే 5.74 కోట్లు వచ్చింది. విజయ్ సినిమాల్లో .. తెలుగు నాట ఇదే అత్యధిక వసూళ్లు.
మాస్టర్ తొలి వారం వసూళ్ల వివరాలు
నైజాం: 1.49 కోట్లు
సీడెడ్: 1.10 కోట్లు
ఉత్తరాంధ్ర: 83 లక్షలు
గుంటూరు: 67 లక్షలు
కృష్ణ: 36 లక్షలు
ఈస్ట్: 48 లక్షలు
వెస్ట్: 56 లక్షలు
నెల్లూరు: 25 లక్షలు
మొత్తం: 5.74 కోట్లు