తమిళ హీరో విజయ్ సినిమాకు భారీ ఓటీటీ ఆఫర్?

మరిన్ని వార్తలు

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం 'మాస్టర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాను తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా రిలీజ్ చేయాలని మొదట నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా విడుదల ఆరు నెలలుగా విడుదలకు నోచుకోలేదు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా విడుదల గురించి మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయి.

 

ఈ సినిమాను ఓటీటీ వేదికల ద్వారా విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఒక ప్రముఖ ఓటీటీ వేదిక డైరెక్ట్ రిలీజ్ కోసం ఈ చిత్రానికి రూ. 80 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సినిమా నిర్మాతలు స్పందిస్తూ తాము థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, ఓటిటి రిలీజ్ ఆలోచన చేయడం లేదని స్పష్టతనిచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా కోలీవుడ్ మీడియాలో మరోసారి మాస్టర్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన వార్తలు గుప్పుమంటున్నాయి.

 

ఒక ప్రముఖ ఓటీటీ వేదిక 'మాస్టర్' చిత్రం డైరెక్ట్ రిలీజుకు వంద కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందని టాక్ వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో అయిన సూర్య నటించిన తాజా చిత్రం 'సూరరై పొట్రు' సినిమా త్వరలో ఓటిటి వేదిక ద్వారా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ 'ఆకాశం నీ హద్దురా' కూడా ఒకేసారి తమిళ వెర్షన్ తో పాటు రిలీజ్ కానుంది. సూర్య లాంటి స్టార్ హీరో సినిమాలు ఓటీటీ వేదికల ద్వారా రిలీజ్ అవుతున్నప్పుడు విజయ్ నటించిన సినిమాలు రిలీజ్ కావడం అసాధ్యం ఏమీ కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

 

సూర్య కంటే విజయ్ మార్కెట్ ఎక్కువ కాబట్టి ఈ వంద కోట్ల రూపాయల డీల్ వచ్చిందని, నిర్మాతలు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరోవైపు సౌత్ ఇండియాలోనే ఇది అత్యంత భారీ ఓటీటీ డీల్ అని సమాచారం. మరి ఈ సినిమాను ఓటీటీ వేదికల ద్వారా రిలీజ్ చేస్తారా లేదా థియేటర్లు తెరిచే వరకూ వేచి చూసి థియేటర్లలోనే రిలీజ్ చేస్తారా అనేది మాత్రం నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS