మ్యూజిక్ మాంత్రికుడు కీరవాణి వారసులు శ్రీ సింహ (హీరో), కాల భైరవ (సంగీతం) తెరంగేట్రం చేస్తోన్న సినిమా 'మత్తు వదలరా'. ఈ సినిమా టీజర్ కాస్సేపటి క్రితం విడుదలయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ టీజర్‌ని విడుదల చేయడం గమనార్హం. ఇక, టీజర్ విషయానికొస్తే.. టీజర్‌ని ఓ సినిమాలా కట్ చేయడం గమనార్హం. శుభోదయం.. అని చెబుతూ, అతి నిద్ర లక్షణాల గురించి బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్ చెబుతోంటే, ఇంకోపక్క టీజర్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు అలా అలా వెళ్ళిపోయాయి. మొత్తంగా ఇదొక థ్రిల్లర్ అనే విషయం స్పష్టమవుతోంది.
షాట్ డివిజన్ దగ్గర్నుంచి అన్నీ టాప్ క్లాస్‌లో వున్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. టీజర్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్ళాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. దర్శకుడు రితేష్ రానా, సినిమాని చాలా జాగ్రత్తగా, చాలా బాగా డీల్ చేశాడు. టెక్నికల్‌గా టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇటీవలి కాలంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న దరిమిలా, ఈ 'మత్తు వదలరా' కూడా ఆ కోవలోనే మంచి విజయాన్ని సాధిస్తుందని టీజర్ విడుదల తర్వాత అందరి నుంచీ సానుకూలమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క, పలువురు సినీ ప్రముఖులు 'మత్తు వదలరా' టీజర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.