అనుష్కకి గాలం వేస్తున్న బాలయ్య

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న సినిమా నిన్ననే లాంఛనంగా ప్రారంభమయిన విషయం విదితమే. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం అనుష్క పేరుని స్వయంగా బాలయ్య ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బాలయ్య అడిగితే, బోయపాటి కాదంటాడా.? అనుష్కతో సంప్రదింపుల ప్రక్రియకి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యాడట బోయపాటి శ్రీను. త్వరలోనే బోయపాటి, అనుష్కతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. గతంలో అనుష్క - బాలయ్య కలిసి 'ఒక్కమగాడు' సినిమా కోసం పనిచేశారు.

 

వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా అప్పట్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అనుష్క స్టార్‌డమ్‌ వేరు. 'సైరా నరసింహారెడ్డి' సినిమా కోసం ఝాన్సీ లక్ష్మీబాయిగా అనుష్క అవతారమెత్తిన విషయం విదితమే. కనిపించింది కొద్ది నిమిషాలపాటే అయినా, అనుష్క ప్రెజెన్స్‌ ఆ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో బాలయ్య, తన తదుపరి సినిమా కోసం అనుష్క పేరుని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరమైన విషయమే. అయితే, అనుష్క ఈ సినిమాకి ఓకే చెబుతుందా.? లేదా.? అన్నది తేలాల్సి వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS