సినిమా హీరోలు కాదు... పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులే ఇప్పుడు నిజమైన హీరోలు. వాళ్లందరికీ ప్రపంచం ఇప్పుడు సెల్యూట్ చేస్తోంది. క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్లు అందిస్తున్న సేవలకు పాదాభివందనాలు సమర్పించుకుంటోంది. చిరంజీవి కూడా పోలీసుల పనితీరుకి కితాబులు ఇచ్చారు. వాళ్లకు సెల్యూట్ చేశారు. ఈ రోజు, కొద్ది సేపటి క్రితం చిరు ట్విట్టర్ లో ఓవీడియోని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరుని కొనియాడారు. ''రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం.
నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. వాళ్ల పనితీరు వల్లే లాక్ డౌన్ విజయవంతమైంది. అలా జరగబట్టే కరోనా విజృంభణ చాలా వరకూ అదుపులోకి వచ్చింది. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలి. వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలి. పోలీసు వాళ్లు చేసుస్తున్న ఈ అమోఘమైన ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వాళ్లకు సెల్యూట్ చేస్తున్న''` అని పేర్కున్నారు చిరు.
#SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020