ఎన్టీఆర్ ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ హీరోయిన్‌!

మరిన్ని వార్తలు

మీరా చోప్రా గుర్తుందా? బంగారం సినిమాలో న‌టించింది. వాన‌లోనూ క‌నిపించింది. ఆ త‌ర‌వాత‌.. ఆమె జాడ లేదు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ మీరా చోప్రా వార్త‌ల్లోకి వ‌చ్చింది. వ‌స్తూ, వ‌స్తూనే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే... ఇటీవ‌ల ఓ సంద‌ర్భంగా ఎన్టీఆర్ కంటే మ‌హేష్ బాబు అంటేనే త‌న‌కు ఇష్ట‌మ‌ని, ఎన్టీఆర్ గురించి త‌న‌కేం తెలీద‌ని వ్యాఖ్యానించింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు. ర‌క‌ర‌కాల ట్వీట్ల‌తో, మెసేజీల‌తో మీరా చోప్రాని వేధించ‌డం మొద‌లెట్టారు. అంతేకాదు.. మీరా చోప్రా త‌ల్లిదండ్రుల‌కు ఫోన్లు చేసి అస‌భ్యంగా మాట్లాడుతున్నార్ట‌. దాంతో మీరా చోప్రా ఇబ్బంది పడుతోంది.

 

ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తూ ఓ ట్వీట్ చేసింది. ఇలాంటి అభిమానుల‌తో మీరు స‌క్సెస్ సాధించిన‌ట్టు ఫీల‌వుతున్నారా? అంటూ నేరుగా ఎన్టీఆర్‌నే ప్ర‌శ్నించింది. ఈ విష‌యంలో స్పందించాల్సిందిగా ఎన్టీఆర్ ని కోరింది. అయినా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి భ‌రోసా రాలేదు. దాంతో సైబ‌ర్ క్రైమ్ ని సంప్ర‌దించింది మీరా. త‌న‌ని దూషిస్తూ వ‌చ్చిన ట్వీట్ల‌ను తొల‌గించ‌మ‌ని ట్విట్ట‌ర్‌ని కోరింది. ఇప్పుడైనా ఎన్టీఆర్ ఈ విషయంపై మాట్లాడ‌తాడేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS