ఒక హిట్ కోసం మీరా తహ తహ

మరిన్ని వార్తలు

వెటరన్ హీరోయిన్స్ అంతా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న ఈ తరుణంలో మీరా జాస్మిన్ కూడా రీ ఎంట్రీ కోసం సిద్ధం అవుతోంది. ఒకప్పుడు తెలుగు , తమిళం, మళయాలం భాషల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మల్లు బ్యూటీ మీరా జాస్మిన్ పెళ్లితో సినిమాలకి బ్రేక్ ఇచ్చింది, ఇప్పడు మళ్ళీ సినిమాల్లో నటించాలని తహ తహ లాడుతోంది. గత ఏడాది సముద్రఖని దర్శకునిగా తెరకెక్కిన విమానం అనే మూవీలో స్పెషల్ రోల్ చేసింది. కానీ అది మీరాజాస్మిన్ అని ఎవరికీ తెలియనే లేదు. ఇప్పుడు 'స్వాగ్​' అనే సినిమాలో నటిస్తోంది.  


22 ఏళ్ల వయసులో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మీరా, పెళ్లి వరకు గ్యాప్ తీసుకోకుండా నటిస్తూనే ఉంది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు తెలుగు సినిమాలకి దూరం అయినా, తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో అవకాశాల కోసం ఎలాంటి పాత్రలు చేయటానికి అయినా రెడీ అని చెప్పటానికి అన్నట్లు ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఛాన్స్ లు అందుకుంటోంది.  


పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీరా జాస్మిన్ అభిమానులకు ఓట్రీట్ ఇచ్చింది. శ్రీ విష్ణు హీరోగా 'స్వాగ్' అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మీరా జాస్మిన్ నటిస్తున్నట్లు టీమ్ అఫీషయల్ గా అనౌన్స్ చేసింది. జూన్ 2 మీరా జాస్మిన్ లుక్ తో ఓ స్పెషల్ పోస్టర్​ను విడుదల చేసింది. "#SWAG ప్రపంచం మన హృదయాలను ఏలిన రాణిని మీ ముందుకు తీసుకువస్తోంది. #మీరా జాస్మిన్​ ఆన్​ బోర్డ్​." అంటూ ఆమెకు వెల్​కమ్ చెప్పింది. ప్రస్తుతం మీరా లుక్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మీరా 'స్వాగ్​' సినిమాతో పాటు 'ది టెస్ట్'​ అనే తమిళ సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మీరాకి మరిన్ని అవకాశాలు రావటం గ్యారంటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS