ఆగస్ట్ 11న మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దేనికదే అన్నట్టుగా ఈ మూడు సినిమాలకీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వరుస సెలవులు కావడంతో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గేలా కన్పించడంలేదు. ఇంకో వైపున ముగ్గురు హీరోలూ నితిన్, రానా, బెల్లంకొండ శ్రీనివాస్ అదే స్థాయిలో సక్సెస్ జోష్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్లు కూడా అంతే. మెయిన్‌గా కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, మేఘా ఆకాష్ ఈ ముగ్గురూ లీడ్ రోల్స్‌లో నటించి విజయం అందుకోగా, ముద్దుగుమ్మ కేథరీన్ అయితే రెండు సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఒకేసారి హిట్ కావడం అమ్మడికి పట్టలేని సంతోషం తెచ్చి పెడుతున్నాయి. ఇక పోతే మరో ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్ 'జయ జానకి నాయకా' సినిమాలో చిన్న రోల్ అయినా పక్కా గ్లామరస్ పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. టోటల్‌గా ఈ బ్యూటీస్ అందరికీ ఆగస్ట్ 11 వెరీ వెరీ స్పెషల్. నటిగా మంచి మార్కులు రకుల్ ప్రీత్ సింగ్‌కి 'జయ జానకి నాయక' సినిమా కోసం పడితే, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కాజల్ అగర్వాల్ మంచి మార్కులు కొట్టేసింది. మొత్తం ఈ బ్యూటీస్ అందరిలోనూ కొత్తగా వచ్చి, యూత్‌ఫుల్ బ్యూటీ అనే కేటగిరీలో అన్ని ఓట్లూ కొట్టుకెళ్లిపోయింది ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. 'లై' సినిమాలోని ఆమె పాత్ర అలాంటిది. సో, బ్యూటీ ఫైట్‌లో విన్నర్‌గా మేఘా ఆకాష్‌ని చెప్పుకోవచ్చు. అలాగని మిగిలినోళ్ళు తక్కువేం కాదు. ఫ్రెష్ ఫేస్ కదా, మేఘా ఆకాష్‌కి కొంచెం ఎడ్జ్ లభించిందంతే.