మెగా హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అల్లు అరవింద్ కుటుంబం నుంచి వచ్చినా... బన్నీని మెగా హీరోగానే చూస్తున్నారు ఫ్యాన్స్. ముందు నుంచీ అంతే. బన్నీ ఎదుగుదల వెనుక మెగా అభిమానుల అండదండలున్నాయి. ఇది కాదనలేని వాస్తవం. అయితే... బన్నీ సెపరేట్ గా ఓ గ్యాంగ్ ని కొనసాగించాలని చూశాడు. `అల్లు ఆర్మీ` పేరుతో.. ఓ అభిమాన సంఘం కూడా మొదలైపోయింది. మధ్యలో `చెప్పను బ్రదర్` అనే డైలాగ్ సైతం మెగా అభిమానులకు, బన్నీకి మధ్య దూరం పెరిగేలా చేసింది. ఆ తరవాత.. బన్నీ తన తప్పు తాను తెలుసుకున్నాడు. మె
గా ఫ్యాన్స్‌కి మళ్లీ దగ్గరవ్వాలని చూశాడు. ఆ ప్రయత్నాలు ఫలించాయి కూడా. అంతా సర్దుకుపోతున్న తరుణంలో.. ఇప్పుడు బన్నీకీ, మెగా ఫ్యాన్స్‌కీ మరోసారి గ్యాప్ వచ్చింది. ఇటీవల `ఆహా`లోని సామ్ జామ్ కోసం బన్నీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ప్రోమోలలో.. తన పేరుకి ముందు మెగాస్టార్ అని తగిలించారు. ఇండ్రస్ట్రీకి నయా మెగాస్టార్ బన్నీనే అనే సంకేతాలు పంపినట్టైంది. దాంతో మెగా ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. మెగాస్టార్ చలవతో.. పెరిగి..మెగాస్టార్‌నే మించిపోవాలని చూస్తున్నాడని బన్నీని ట్రోల్ చేయడం మొదలెట్టారు. పరిస్థితి గమనించిన ఆహా.. మెగా ఫ్యాన్స్ కి సారీ చెప్పింది.
అది తెలియక చేసిన పొరపాటని ప్రకటించింది. అయినా సరే, మెగాఫ్యాన్స్ శాంతించడం లేదు. ఇప్పటికీ బన్నీని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ గ్యాప్ సద్దుమణగాలంటే.. బన్నీ నే ఏదో ఓ స్టేట్ మెంట్ ఇవ్వాలి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు బన్నీ. ట్విట్టర్ ద్వారా ఈ గొడవకు ఓ పుల్ స్టాప్ పెడితే సరిపోతుంది. కానీ.. బన్నీ ఆ ప్రయత్నం చేయలేదు. మున్ముందు చేస్తాడో, లేదో తెలీదు. నిజానికి ఇది ఓ చిన్న మిస్ అండర్ స్టాండింగ్, మిస్ కమ్యునికేషన్. బన్నీ ఆ యాంగిల్ లోనే దీనికి ఓ పుల్ స్టాప్‌పెట్టాలి. లేదంటే.. ఇదే చినికి చినికి గాలివాన అయిపోతుంది