#Mega154: మెగా ఫ్యాన్స్ కోరుకున్నది ఇదే

By iQlikMovies - October 26, 2022 - 09:27 AM IST

మరిన్ని వార్తలు

మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న మెగా 154వ టైటిల్ టీజర్ విడుదలైంది. ముందు నుంచి చెప్పినట్లుగానే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ ఖరారు చేశారు. అయితే టీజర్ మాత్రం ఫ్యాన్స్ ని కట్టిపడేసింది. లుంగీ కట్టుకుని, చేతికి కడియం, బీడీ కాల్చుతూ, చెవి పోగుతో ఊరమాస్‌ గెటప్‌లో కనిపించారు చిరంజీవి. చిరంజీవి నటించిన ఒకప్పటి మాస్‌ చిత్రాలను గుర్తు చేస్తోంది ‘వాల్తేరు వీరయ్య'.

 

నిజానికి ఫ్యాన్స్ మెగాస్టార్ రీఎంట్రీలో ఇలాంటి గెటప్ లోనే చూడాలని కోరుకున్నారు. సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల్లో కుదరలేదు. చిరంజీవి మాస్ గ్రేస్ ఈ సినిమాల్లో మిస్ అయ్యింది. అయితే ఎట్టకేలకు దర్శకుడు బాబీ మళ్ళీ వింటేజ్ చిరంజీవిని ప్రజంట్ చేశాడు. ‘వాల్తేరు వీరయ్య'టీజర్ తో మెగా ఫ్యాన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. మెగా మాస్ లుక్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఖుషిగా వున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS