టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో తన భార్య సాక్షి సింగ్ తో కలిసి ధోనీ ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీకి సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
అంతేకాదు ఈ బ్యానర్‌పై తెరకెక్కనున్న సినిమాకు కథను కూడా అందించనుంది. రమేష్ తమిళమణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘నేను సాక్షి రాసిన కథను చదివినప్పుడు చాలా స్పెషల్‌గా అనిపించింది.
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’ అని దర్శకుడు రమేశ్ తెలిపారు. ఈ సినిమా కాస్ట్, క్రూ వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. క్రికెటర్ గా చెరగని ముద్ర వేసుకున్న ధోని సినిమా రంగంలోకి రావడం అడుగుపెట్టడంతో పరిశ్రమ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు.