సంక్రాంతి సందడి కోసం జెట్ స్పీడ్ లో రెడీ అవుతున్నారు మెగాస్టార్. ‘వాల్తేరు వీరయ్య’ ని ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి తేవాలని ఫిక్సయిపోయారు. అందుకే ఒక పక్క చిత్రీకరణ సాగుతుండగా, మరోవైపు ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. బాస్ పార్టీ సాంగ్ పేరుతో ఓ పాటని ఈనెల 23న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా మెగాఫ్యాన్స్ కి చాలా నచ్చింది.
నిజానికి చాలా రోజులగా అసలు సిసలైన మెగా మాస్ అభిమానులకు అందడం లేదు. సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ ఇవన్నీ మెగా మార్క్ చిత్రాలు కావు. అయితే వీరయ్య మాత్రం మొదటి నుండి మాస్ మసాలా చిత్రంగా ఊరిస్తుంది. ఈ సినిమా నుండి విడుదలైన కంటెంట్ కూడా హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చుతుంది. వింటేజ్ మెగాస్టార్ ని చూసి చాలా కాలమైయింది. దర్శకుడు బాబీ మళ్ళీ పాత మెగాస్టార్ గుర్తు చేస్తూ వీరయ్యని తయారుచేస్తున్నారు. గాడ్ ఫాదర్ తో కాస్త నిరాశ చెందినా.. వీరయ్య ఆ వెలితిని తీర్చే సినిమా అవుతుందని నమ్మకంగా వున్నారు మెగా ఫ్యాన్స్.