ఇప్పటి వరకూ రెండు పడవల ప్రయాణం సాగిస్తూ వచ్చారు పవన్‌కల్యాణ్. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ రెండింటికీ న్యాయం చేయాలని చూశారు. నిజానికి సినిమాలకంటే కూడా రాజకీయాలపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆయన లక్ష్యం క్లియర్ అయిపోయింది. 2024 ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం సినిమాల్ని సైతం వదులుకోవడానికి రెడీ అయిపోయారు. చేతిలో ఉన్న `హరి హర వీరమల్లు`ని పూర్తి చేసి, మరే సినిమా చేయకూడదని పవన్ ఫిక్సయినట్టు టాక్.
అందుకే హరీష్ శంకర్ సినిమాని సైతం పక్కన పెట్టేశార్ట. మిగిలిన నిర్మాతలకూ ఇదే మాట చెప్పారని వినికిడి. అయితే పవన్.. ఇలా నిర్మాతలకు ఓ మాట చెబితే సరిపోదు. వాళ్లు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి చెల్లించాలి. పవన్ దగ్గర ముగ్గురి నిర్మాతల అడ్వాన్సులు ఉన్నాయని టాక్. వాటిని పవన్ చెల్లించాలంటే కనీసం రూ.50 కోట్లయినా కావాలి. కానీ.. అంత ధైర్యం నిర్మాతలకు ఉందా? పవన్‌కి ఎదురెళ్లి అడ్వాన్సలు అడగ్గలరా? అన్నింటికికంటే ముఖ్య విషయం ఏమిటంటే నిర్మాతలెవరూ అడ్వాన్సులు ఇచ్చేయాలని పవన్‌పై ఒత్తిడి తీసుకురాడం లేదట.
ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సినిమా చేస్తానని మాటివ్వాలని, అప్పటి వరకూ తాము ఎదురు చూస్తామని నిర్మాతలు అంటున్నట్టు టాక్. పవన్‌కి ఇది మంచి ఆప్షనే. 2024 ఎన్నికలు అయిపోయాక..మళ్లీ సినిమాలు చేసేసుకోవొచ్చు.