పుష్ప 2 ట్రైలర్ పై మెగా కాంపౌండ్ మౌనం ఎందుకు?

మరిన్ని వార్తలు

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది. అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మూవీ యూనిట్. ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి దాదాపు 2 లక్షలు మంది వచ్చారు. 1200 మంది సెక్యూరిటీని పెట్టారు బీహార్ సర్కార్. ఈ ఈవెంట్ ని లైవ్ లో రెండు లక్షలకి పైగా వీక్షించారని మూవీ టీమ్ అఫీషియల్ గా పేర్కొంది. ఒక ఈవెంట్ ని ఇంతమంది లైవ్ లో చూడటం ఇదే మొదటిసారని టీమ్ పేర్కొంది. ఒక్క ఈవెంట్ తోనే పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది.

రిలీజైన ట్రైలర్ కూడా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఆల్ టైం హయ్యస్ట్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. ట్రైలర్ అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. వరల్డ్ వైడ్ పుష్ప 2  ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. దీనితో పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమౌళి పుష్ప 2 పై స్పందిస్తూ 'పాట్నాలో వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయ్యింది. పార్టీ కోసం వెయిట్ చేస్తున్నా పుష్ప అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. RGV, అనిల్ రావి పూడి, ప్రశాంత్‌ వర్మ, బుచ్చి బాబు సానా, అజయ్ భూపతి, హరీష్ శంకర్, మెహర్ రమేష్ తదితరులు ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.

హీరోల్లో శర్వానంద్, సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం, ఆది సాయి కుమార్, అల్లు శిరీష్ లాంటి వారు  పుష్ప 2 ట్రైలర్ గూర్చి కామెంట్స్ చేశారు. అందరికీ అల్లు అర్జున్ పేరు పేరునా సోషల్ మీడియాలో థ్యాంక్స్‌ చెప్పారు. దేశమంతా పుష్ప 2 ట్రైలర్ ని పొగుడుతూ పోస్ట్ చేస్తూ ఉంటే, మెగా హీరోలు మాత్రం ఎవరూ ఎలాంటి కామెంట్ చేయకుండా కామ్ గా ఉన్నారు. చివరికి కన్నడ హీరో రిషబ్‌ శెట్టి కూడా పుష్ప టీమ్ కి విషెష్ చెప్తూ ట్రైలర్ గూర్చి ప్రస్తావించారు. అలాంటిది మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, సుష్మిత, ఎవరూ పోస్టులు పెట్టలేదు. ప్రతి చిన్న సినిమాని సపోర్ట్ చేసే చిరంజీవి పుష్ప లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గూర్చి మాట్లాడకపోవడం విచిత్రంగానే ఉంది.

దీనితో మెగా, అల్లు వారి వివాదాలు ముదిరాయి అని సంబంధాలు విచ్చిన్నం అయినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. అందుకే స్పందించే టైం లేదు అనుకున్నా, మిగతావారు స్పందించక పోవటం మరికొన్ని అపోహలకు దారి తీసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS