చిరంజీవి అంటే.. కష్టం..
చిరంజీవి అంటే... స్వయం కృషి
చిరంజీవి అంటే.. ఓ మెగాస్టార్!!
డాన్సంటే చిరంజీవి
ఫైటింటే చిరంజీవి
కామెడీ టైమింగ్ అంటే చిరంజీవి..
అందుకే దశబ్దాలుగా.. నెంబర్ 1 స్థానంలో అలా ఉండిపోగలిగాడు. ఆ స్థానం వెనుక ఓ చరిత్ర వుంది. ఆ కథ చెబితే.. మరో చరిత్ర అవుతుంది. దటీజ్.. మెగా స్టార్!
ఇండ్రస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదగడం చాలా కష్టం అంటారు. కానీ... ఎవరి అండదండలూ లేకుండా ఎలా ఎదగాలో, ఎదిగిన తరవాత.. ఒకరికి గాడ్ ఫాదర్ గా ఎలా మారాలో చెప్పిన ప్రయాణం చిరంజీవిది.
ఎన్టీఆర్ - ఏఎన్నార్ పరిశ్రమకు రెండు కళ్లయితే - మూడో కన్ను తెరచిన `శివ` శంకర వర ప్రసాద్.. చిరంజీవి.
తెలుగు సినిమా స్థాయిని, స్టామినాని పెంచిన కథానాయకుడు. ఇండ్రస్ట్రీ రికార్డ్ అంటే ఏమిటో రుచి చూపించినవాడు. మాస్ ఫ్యాన్స్ ని సంపాదిస్తే.. ఆ హీరో రేంజ్ ఏ స్థాయికి వెళ్తుందో సాక్ష్యంగా నిలిచిన కథానాయకుడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ పొషీషన్ లో ఉండడం అంటే మాటలు కాదు. తరాలుగా హీరోలుగా మారుతున్నా, స్టార్లు వస్తున్నా.. ఇప్పటికీ ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టే కొత్త హీరోకి సైతం.. స్ఫూర్తి.. చిరంజీవే.
చిరుని కేవలం కమర్షియల్ హీరోగానే చూస్తాం గానీ.. ఆయన చేసిన ప్రయత్నాలు మర్చిపోకూడదు.
స్వయం కృషి, ఆరాధన, రుద్రవీణ.. స్టార్ హీరోగా ఉండి, మాస్ ఫాలోయింగ్ ఉండీ.. ఇలాంటి కథలు, పాత్రలు ఒప్పుకుని - తనలోని నటుడినీ సంతృప్తి పరిచారు చిరంజీవి.
మధ్యలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి - తిరిగి వచ్చి - మళ్లీ ఇండ్రస్ట్రీ రికార్డు కొట్టి - తనలో స్టామినా తగ్గలేదని నిరూపించుకున్నాడు చిరు. అందుకే.. చిరు అంటే నెంబర్ వన్, నెంబర్ వన్ అంటే.. చిరు.
త్వరలోనే `ఆచార్య`గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చిరు. వాటితో పాటు మరో మూడు ప్రాజెక్టులూ పైప్ లైన్ లో ఉన్నాయి. రాబోయే కాలంలోనూ చిరు ఇలానే అలరించాలని, తన పేరుకి తగ్గట్టుకు చిరంజీవై వర్థిల్లాలని ఐ.క్లిక్ కోరుకుంటోంది. హ్యాపీ బర్త్ డే టూ.. మెగాస్టార్!!