హానుమాన్ గా మెగాస్టార్ మ్యాజిక్ చేస్తారా?

మరిన్ని వార్తలు

ఇటీవల వచ్చిన హానుమాన్ మూవీతో స్టార్ డైరక్టర్ స్టేటస్ కి చేరాడు ప్రశాంత్ వర్మ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ మూవీ ప్రంభంజనం సృస్టించింది. అన్ని భాషల్లోను హనుమాన్ కలక్షన్స్ వర్షం కురిపించింది. తేజా సజ్జా పాన్ ఇండియా హీరో రేంజ్ కి ఎదిగాడు. హనుమాన్ కి సీక్వెల్గా జై హనుమాన్ మూవీ రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకొంటోంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడో అని ఎదురుచూస్తున్నారు. ఈ  క్రమంలోనే ఈ మూవీలో హనుమాన్ పాత్రలో టాలీవుడ్ సూపర్ స్టార్ నటించ నున్నట్లు సమాచారం. దీనితో ఈ న్యూస్ తెగ వైరలవుతోంది. 


జై హనుమాన్ సినిమాలో హనుమాన్ గా మెగాస్టార్ నటిస్తున్నట్లు టాక్. చిరంజీవి హనుమంతుడి భక్తుడు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. హనుమాన్ సినిమాకి తన సపోర్ట్ ని అందిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేశారు. ఆ సందర్భంలో హనుమాన్ మూవీలో నటించే ఛాన్స్ తనకి వస్తే తప్పకుండ నటిస్తా అన్ని చెప్పారు. ఇప్పుడు ఆడియన్స్ ఆ వార్తల్ని నిజం చేస్తూ జై హనుమాన్ లో చిరు ఆంజనేయుడి పాత్రలో నటిస్తే బాగుంటుంది అని కామెంట్స్ పెట్టడంతో వీటి పై స్పందించిన ప్రశాంత్ వర్మ మీరు ఊహిస్తున్నది నిజమే అని చూచాయిగా పేర్కొన్నాడు. 


హనుమాన్ 100 డేస్ ఫంక్షన్ లో ప్రశాంత్ వర్మ  మాటాడుతూ  “మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే. నమ్మకం పెట్టుకోండి, మీరు అనుకున్న స్థాయిలోనే సినిమా ఉంటుంది. మీ ప్రతి పాజిటివ్ అండ్ నెగటివ్ కామెంట్ ని కూడా నేను చదువుతున్నాను. వాటిని దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నాను” అంటూ స్పష్టం చేశాడు . దీనితో జై హనుమాన్ లో చిరుని హనుమాన్ గా ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ఇదే గనక జరిగితే జై హనుమాన్ వేరే లెవెల్లో ఉంటుంది అనటంలో సందేహం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS