హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో... చిరంజీవి బ‌యోపిక్‌.

By Gowthami - September 18, 2019 - 14:15 PM IST

మరిన్ని వార్తలు

మెగా కుటుంబానికి వీరాభిమానుల్లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌డు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ప‌డి చ‌చ్చిపోతాడు. ప‌వ‌న్‌కి తాను భ‌క్తుడిన‌ని చాలాసార్లు ప్ర‌క‌టించుకున్నాడు హ‌రీష్‌. అటు ప‌వ‌న్‌తో ఇటు బ‌న్నీతో సినిమాలు చేశాడు. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌తో `వాల్మీకి` తెర‌కెక్కించాడు. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కాబోతోంది. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ దృష్టి చిరంజీవి బ‌యోపిక్ పై ప‌డింది.

 

చిరంజీవి క‌థ‌ని సినిమాగా తీయాల‌న్న ఆలోచ‌న‌లో హ‌రీష్ ఉన్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌రుణ్‌తేజ్ వెల్ల‌డించ‌డం విశేషం. చిరంజీవి గారి క‌థ‌ని తెర‌కెక్కించాల‌ని హ‌రీష్ అనుకుంటున్నాడ‌ని, ఆ క‌థ‌లో చ‌ర‌ణ్ అయితే బాగుంటాడ‌ని, చ‌ర‌ణ్ ఒకవేళ కాదంటే.. తాను న‌టించ‌డానికి రెడీ అని అంటున్నాడు వ‌రుణ్‌. చిరు బ‌యోపిక్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు.

 

ఆ పాత్ర‌లో వ‌రుణ్ న‌టిస్తే ఇంకా బాగుంటుంది. అయితే హైట్ స‌మ‌స్య‌, చిరు కంటే వ‌రుణ్ చాలా ఎత్తుగా ఉంటాడు. ఇదే విష‌యంపై కూడా వ‌రుణ్ స్పందించాడు. `హైట్ స‌మ‌స్య అయితే.. దాన్ని సీజీలో త‌గ్గించుకుంటా` అంటూ చ‌మ‌త్కరించాడు. వ‌రుణ్ స‌ర‌దాగా అన్నాడో, సీరియ‌స్‌గా అన్నాడో తెలీదు గానీ.. ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్తే మాత్రం అదిరిపోతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS