ఓ వైపు 'సైరా', మరోవైపు 'వాల్మీకి'. రెండు సినిమాల ప్రమోషన్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. భారీ బడ్జెట్ సినిమా 'సైరా' విడుదలకు రోజుల వ్యవధి మాత్రమే మిగిలుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నట విశ్వరూపం 'వాల్మీకి'కి మరో రెండు రోజులు మాత్రమే టైముంది. అందుకే ఎక్కడ చూసినా ఈ రెండు సినిమాల మోతే. డిజిటల్ సౌండింగ్‌లో ప్రమోషన్స్ హోరెత్తించేస్తున్నారు. చరణ్, చిరంజీవి 'సైరా' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటే, వరుణ్ తేజ్ అండ్ టీమ్ 'వాల్మీకి' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
రెండు సినిమాలకూ గెటప్స్ హైలైట్. అటు మెగాస్టార్ చిరంజీవి మీసం మెలేసి 'సైరా నరసింహా రెడ్డి.. సై సైరా..' అనిపిస్తుంటే, ఇటు గద్దలకొండ గణేష్ .. గజ గజలాడించేస్తున్నాడు. మొదట్లో ఓ మోస్తరు అంచనాలతో ఉన్న 'వాల్మీకి' విడుదల దగ్గర పడే సమయానికి అంచనాలు ఆకాశాన్నంటేశాయి. సినిమాకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్ రివీల్ చేస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది చిత్ర యూనిట్ ఈ సినిమా సక్సెస్‌పై. రీమేక్ సినిమా కాబట్టి, ఆల్రెడీ సక్సెస్‌పై ఓ ఐడియా ఉంటుంది. అయితే, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.
'వాల్మీకి' యాక్షన్ ఇలా ఉంటే, 'సైరా' రియాక్షన్ మరోలా ఉంది. ఈ రోజు అనగా బుధవారం 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈవెంట్‌ని పోస్ట్ పోన్ చేశారు కానీ, ట్రైలర్ విడుదల చేయనున్నారు. మరి కొద్ది గంటల్లో 'సైరా' ట్రైలర్ విడుదల కానుంది. ఎప్పుడో వచ్చిన టీజర్ సౌండింగే ఇంకా చెవుల్లో దుమ్ము రేపుతోంది. ఇక తర్వాత వచ్చిన టీజర్ ఆ రేంజ్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లగా, ఇప్పుడు మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న ట్రైలర్ ఇంకెలాంటి ఎఫెక్ట్ ఇస్తుందో ఊహించడమే కష్టంగా ఉంది.