శ్రీకాంత్‌ని పరామర్శించిన మెగాస్టార్‌ చిరంజీవి.

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి, నటుడు శ్రీకాంత్‌ని పరామర్శించారు. శ్రీకాంత్‌ తండ్రి అనారోగ్యంతో కన్నుమూసిన దరిమిలా, శ్రీకాంత్‌ని పరామర్శించిన చిరంజీవి, ఆయనకు ధైర్యం చెప్పారు. శ్రీకాంత్‌ తండ్రి మేకా పరమేశ్వరరావు పార్తీవ దేహానికి చిరంజీవి నివాళులర్పించారు. చిరంజీవికి శ్రీకాంత్‌ అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెల్సిందే. చిరంజీవితో ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమాల్లో ఏటీఎం పాత్రలో శ్రీకాంత్‌ నటించాడు. మరోపక్క, శ్రీకాంత్‌ తనకు తమ్ముడి లాంటివాడని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పారు కూడా.

 

కాగా, పరమేశ్వరరావు 1948 మార్చి 16న కృష్ణా జిల్లా మేకావారి పాలెంలో జన్మించారు. అనంతరం ఆయన కర్నాటకకు వలస వెళ్ళారు. మేకా నరసింహారావుకి ఇద్దరు కుమారులు. అందులో ఒకరు శ్రీకాంత్‌ కాగా, మరొకరు అనిల్‌. శ్రీకాంత్‌ సోదరుడు అనిల్‌ పలు సినిమాల్లో నటించిన విషయం విదితమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS