మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. సినిమాల్లోనే కాదు బయట కూడా తన వ్యక్తిత్వంతో మెగాస్టార్ అనిపించుకున్నారు. ఎప్పటి నుంచో టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఎందరు స్టార్స్ వచ్చినా చిరంజీవి స్థానం పదిలం. చిరు సినిమా రిలీజ్ అంటే బాక్సాఫీస్ కళ కళ లాడుతుంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వసూళ్లు కురిపిస్తుంది. డిజాస్టర్ కి కూడా భారీ కలక్షన్స్ వస్తుంటాయి. అలాంటిది సాలిడ్ హిట్ పడితే రికార్డ్స్ ఖాయం. గత ఏడాది వాల్తేరు వీరయ్య తో సత్తా చాటారు. భోళా శంకర్ డిజాస్టర్ తో ఫాన్స్ ని నిరాశపరిచానన్న ఆలోచనతో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు చిరు. తనకి భారీ రెమ్యునరేషన్ లు ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఇంట్రస్ట్ గా ఉన్నారు. మెగాస్టార్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషితో ఒక్క సినిమా చేసినా చాలు అనుకున్నవారు కూడా ఉన్నారు.
చిరు తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన యంగ్ హీరోలు పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగి, 100 కోట్ల రెమ్యునరేషన్ లు తీసుకుంటున్నారు. అలాంటిది ఇంత క్రేజ్ ఉన్న చిరుకి భారీ రెమ్యునరేషన్ ఇవ్వటం తప్పేం కాదన్నది నిర్మాతల ఆలోచన. ఈ క్రమంలోనే 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ క్లబ్ లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. చిరు ప్రజంట్ వశిష్ఠ దర్శకత్వం లో విశ్వంభర చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకో రెండో ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పారని సమాచారం. ఇవి కాకుండా ఇంకో సినిమాకి కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ చిత్రానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారని రూమర్స్. ఈ న్యూస్ విన్న మెగా ఫాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.