ఈమధ్యకాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరైనా ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఆర్ధికంగా ఆదుకునే అంశంలో మెగాస్టార్ చిరంజీవి ముందుంటున్నారు. అందులో భాగంగానే ప్రముఖ హాస్యనటికి ఆర్ధిక సహాయం చేశాడు.
ఆ వివరాల్లోకి వెళితే, ప్రముఖ నటి సుభాషిణి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్సపొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన రెండవ కూతురుని స్వయంగా ఇంటికి పంపించి రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందచేయించారు.
శ్రీజ ఇంటికి వచ్చి సుభాషిణి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని ఆర్ధికంగా సహాయం చేశారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా సహాయం కావాల్సి వస్తే తప్పకుండా తాము ఉంటాము అని హామీ కూడా ఇచ్చారట శ్రిజ.
మొత్తానికి ఇటువంటి మంచి పని చేయడంతో మెగా కుటుంబం పైన ఇప్పటికే ఉన్న మంచి పేరు మరింత పెరిగింది.