పవన్ కళ్యాణ్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే: ABN రాధాకృష్ణ

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండుమూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ టీవీ ఛానల్స్ అధిపతుల పైన ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్స్ ఇప్పుడు సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్నాయి.

అయితే అలా చేసిన కొన్ని ట్వీట్స్ ప్రముఖ మీడియా ఛానల్, పత్రికా యజమాని అయిన రాధాక్రిష్ణకి మనస్తాపం కలిగించాయాట. తన పైన చేసిన వ్యాఖ్యలకి, ట్వీట్స్ కి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు సదరు ట్వీట్స్ ని కూడా తొలిగించాలని ఒక లీగల్ నోటీసుని పవన్ కళ్యాణ్ కి పంపించడం జరిగింది.

ఇవి గనుక వెంటనే చేయకపోతే, పవన్ కళ్యాణ్ పైన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా సంబందిత అధికారులకి ఫిర్యాదు చేస్తాను అని ఆయన తాను పంపిన లీగల్ నోటిసులో పెర్కొనట్టుగా తెలిసింది.

మొత్తానికి ఈ ట్వీట్స్ రోజుకొక కలకలం రేపుతున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS