టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్ సేన్ మునుపటి సినిమా హిట్ మంచి కమర్షియల్ హిట్టయింది. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'పాగల్'. నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పిస్తుండగా, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
ఈరోజు 'పాగల్' టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్‌లో విష్వక్ సేన్ డాషింగ్‌గా కనిపిస్తున్నాడు.
విష్వక్ సేన్ క్యారెక్టర్‌లో ఓ లవర్‌తో పాటు ఫెరోషియస్ పర్సన్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. టీజర్‌లో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి అందంగా కనిపిస్తే, మురళీ శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.