చిరంజీవి ఇంట్లో పవన్‌కళ్యాణ్ కోసం డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కి పవన్‌కళ్యాణ్ హాజరయ్యారు. కుటుంబమంతా ఆహ్లాదంగా గడిపింది. ప్రత్యేకించి చిరంజీవితో కాస్సేపు సమావేశమైన పవన్‌కళ్యాణ్ సినిమా విశేషాలతోపాటు, రాజకీయాలపైన కూడా చర్చించినట్లు తెలియవస్తోంది. వదిన సురేఖ, అబ్బాయ్ రామ్‌చరణ్‌లతోనూ పవన్‌కళ్యాణ్ ఈ సందర్బంగా ముచ్చటించారట. నిర్మాతగా తొలి ప్రయత్నంతోనే మంచి విజయాన్ని అందుకున్న చరణ్‌ని పవన్‌కళ్యాణ్ అభినందించారు. అలాగే, తాను నిర్మాతగా రూపొందించబోయే సినిమాలో చరణ్ హీరోగా నటించే విషయమై కూడా చర్చలు జరిపారట పవన్‌కళ్యాణ్. 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హాజరు కాలేకపోయిన పవన్‌కళ్యాణ్, చిరంజీవి ఇంటికి వెళ్ళి సినిమా ఘనవిజయం సాధించినందుకుగాను శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఈవెంట్లలో చిరంజీవి, పవన్‌కళ్యాణ్ హాజరవడం చాలా అరుదు. అయితే ఇతర హీరోల సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ తన కుటుంబంలోని హీరోల సినిమా ఫంక్షన్లకు పవన్ హాజరు కాకపోవడం కొంత విమర్శలకు తావిస్తోంది. ఆ విమర్శలెలా ఉన్నప్పటికీ కూడా మెగా కుటుంబంలో ఒకడిగా పవన్‌కళ్యాణ్, సందర్బం వచ్చినప్పుడు కుటుంబంతో సరదాగా గడుపుతుండడం ఆభినందించదగ్గదే. బంధాలు, అనుబంధాల పరంగా పవన్‌కళ్యాణ్ ఎప్పటికీ అన్నయ్య చాటు తమ్ముడే. రాజకీయంగా ఎవరి దారి వారిదే గనుక, ఎవరి బిజీ పనుల్లో వారున్నారనుకోవాలి.