సామాన్యుల నుండి సెలబ్రిటీల దాక ఇప్పుడు చర్చించుకుంటున్న ఏకైక మాట ‘జల్లికట్టు’. తమిళ ప్రజలు జల్లికట్టు పై ఉన్న నిషేదాన్ని తొలగించే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని ఇప్పటికేతేల్చి చెప్పేసారు.
ఇదిలా ఉంటే, తమిళ సినీప్రముఖుల నుండే కాక తెలుగు హీరోల నుండి కూడా దీనికి మద్దతు వ్యక్తం అవుతుంది. మహేష్ బాబు ఇప్పటికే తన మద్దతు ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. తాజాగా పవన్ కళ్యాణ్ సైతం ఈ ప్రజా ఉద్యమానికి తన గొంతు కలిపాడు.
అదే సమయంలో కోడిపందాల పై ఉన్న బ్యాన్ కూడా అసమంజసం అని తన ట్వీట్ల ద్వారా చెప్పాడు. మీరు ఒకసారి చూడండి పవన్ స్పందన-