మెగా ఫాన్స్ కి సంబరాలే సంబరాలు. లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు న్యూ ఇయర్ లో కూడా మంచి శుభవార్త దొరికింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ వరించినట్లు తెలుస్తోంది. చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డుపై రిపబ్లిక్ డే రోజు మోదీ సర్కార్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నట్లు సమాచారం. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను సైతం అంటూ ముందుకొస్తారు చిరు. టాలీవుడ్ లో అందరికీ ఓపెద్ద దిక్కులా వ్యవహరిస్తుంటారు. కొవిడ్ టైమ్ లో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు, జర్నలిస్టులకి నిత్యావసరాలు అందజేశారు చిరంజీవి. సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు. ఈ సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు వరించినట్లు తెలుస్తోంది. చిరు పద్మవిభూషణ్‌కు ఎంపికైన వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌లో సంబరాలు మొదలయ్యాయి.
లాస్ట్ ఇయర్ భోళాశంకర్ తో వచ్చిన చిరు ప్రజంట్ విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.