ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణ విజయం సాధించి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గా ఎన్నికవడం తెలిసిందే. ఆ తర్వాత వివిధ రంగాల ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే సినిమా పరిశ్రమ నుంచి అంతంత మాత్రమే స్పందన లభించింది. ఒకానొక సందర్భంలో సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపై స్పందించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఎన్నికైన తనను ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కలవలేదు అని తన అసంతృప్తి ని తెలియజేసారు.
ఫిలిం ఛాంబర్ కూడా దీనిపై స్పందించింది. నిర్మాతల మండలి అధ్యక్షులు దిల్ రాజు అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేదు అని అతను విదేశాల నుండి రాగానే త్వరలో కలుస్తాం అని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాతల మండలి సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే ఈ సోమవారం మెగా స్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ భేటీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా కలిసిన మొదటి హీరో చిరంజీవి. సినిమా పరిశ్రమ, రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వానికి తన సహకారం ఉంటుందని చిరు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే కేసీఆర్ కు , కేటీఆర్ కి సన్నిహితంగా ఉండే మెగాస్టార్, సీఎం రేవంత్ రెడ్డి ని కలవడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారిని వారి నివాసంలో ప్రముఖ సినీ నటులు శ్రీ చిరంజీవి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.@KChiruTweets pic.twitter.com/Goktu7B5NW
— Telangana CMO (@TelanganaCMO) December 25, 2023