దటీజ్‌ మెగాస్టార్‌: అక్కడా టాప్‌ ప్లేసే.!

By iQlikMovies - December 14, 2018 - 11:16 AM IST

మరిన్ని వార్తలు

ప్రతీ ఏడాది గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీస్‌ని ఎంపిక చేస్తుంటుంది. తాజాగా ఈ ఏడాది అంటే 2018 సంవత్సరానికిగానూ గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీ లిస్టును విడుదల చేసింది. ఈ లిస్టులో మెగాస్టార్‌ చిరంజీవి టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. ఇందుకు కారణం ఆయన నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రమేనట. ఈ ఏడాదిలో విడుదలైన 'సైరా' టీజర్‌ని రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వీక్షించారు. ఇప్పటికీ 'సైరా' టీజర్‌ని యూ ట్యూబ్‌లో వీక్షించేవాళ్లు లేకపోలేదు.

 

తొలిసారి చూసిన ఫీలింగ్‌నే చూసిన ప్రతీసారి ఆడియన్స్‌ ఫీలవుతుంటారు. అదీ ఈ టీజర్‌ స్పెషాలిటీ. ఇకపోతే ఈ ఏడాదిలో చాలా చాలా వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. కానీ సెర్చింగ్‌ లిస్టులో టాప్‌ ప్లేస్‌ మెగాస్టార్‌దే కావడం విశేషం. ఇక ఈ లిస్టులో తర్వాతి స్థానాలను నేచురల్‌ స్టార్‌ నాని, బాలకృష్ణ, విజయ్‌దేవరకొండ సొంతం చేసుకోవడం మరో విశేషం.

 

లేడీస్‌ విషయానికి వస్తే, టాప్‌ ప్లేస్‌లో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నిలిచింది. ఈ భామ సింగిల్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. సోషల్‌ మీడియా వేదికగా భాషలు, దేశాలు దాటేసింది వన్‌ అండ్‌ ఓన్లీ నైట్‌లో. సంచలనాలకే సంచలనం ఇది. అందుకే లేడీస్‌లో టాప్‌ ప్లేస్‌ ఆమెకే దక్కింది. ఆ తర్వాతి సెన్సేషన్‌ కన్నడ కుట్టీ రష్మికా మండన్నా. సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీకున్న క్రేజ్‌ కూడా చెప్పుకోదగ్గదే. సో సెకండ్‌ ప్లేస్‌ ఈమెనే వరించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS