బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన మేఘా ఆకాష్‌.!

మరిన్ని వార్తలు

'లై' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మేఘా ఆకాష్‌. అమ్మడు తెరంగేట్రానికి ముందే చాలా చాలా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది కానీ, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విడుదలయ్యాక తుస్సుమనిపించింది. హీరోయిన్‌ రోల్‌లో మేఘా ఆకాష్‌ చెప్పుకోదగ్గ మార్కులు వేయించుకోలేకపోయింది. 

ఎట్‌ ఏ టైమ్‌ యంగ్‌ హీరో నితిన్‌తో రెండో సినిమాలకు ఛాన్స్‌ కొట్టేసింది. 'లై' తర్వాత నితిన్‌ నటించిన 'ఛల్‌ మోహన్‌రంగా' సినిమాలోనూ ఈ అమ్మడే హీరోయిన్‌గా నటించింది. అయితే తొలి సినిమాతో పోల్చితే, రెండో సినిమాకి నటన పరంగా, అప్పియరెన్స్‌ పరంగా ఒకింత బెటర్‌ అనిపించుకుంది కానీ, సినిమా రిజల్ట్‌ని బట్టే కదా హీరోయిన్స్‌ ఫ్యూచర్‌ ఆధారపడి ఉండేది. సో ఈ సినిమా కూడా నాట్‌ ఓకే అనిపించుకోవడంతో ఇక ఆ తర్వాత మరో అవకాశం దరి చేరలేదు ఈ ముద్దుగుమ్మని. 

టాలీవుడ్‌లో పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ముద్దుగుమ్మల నెక్ట్స్‌ ఛాయిస్‌ కోలీవుడ్‌. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదృష్టం చేజిక్కించుకుంది. వరుస అవకాశాలతో బిజీగానే గడుపుతోంది ప్రస్తుతం. తాజాగా సీనియర్‌ హీరో శింబు సరసన నటించే బంపర్‌ ఛాన్స్‌ దక్కించుకుంది ఘ..ఘ..మేఘ ఆకాష్‌. 

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్‌లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఎంపికైంది. శింబు హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్‌కి అవకాశం దక్కడమంటే అదృష్టమే అని చెప్పాలి. ఈ బంపర్‌ ఆఫర్‌తో తమిళ తంబీల దగ్గరే పూర్తిగా ఫిక్స్‌ అయిపోతుందేమో మేఘా ఆకాష్‌ చూడాలిక.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS