ఈ మెగా హీరో ఈసారైన హిట్ కొడతాడా?

మరిన్ని వార్తలు

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు. ఏమైందో ఏమో కాని అగ్ర దర్శకుడు అయిన వినాయక్ తో చేసిన చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లాపడింది. దీనికి ప్రధాన కారణం అయిన ఎంచుకునే కథలే అని తెలుస్తుంది.

ఈ తరుణంలో ఆయన ఈమధ్యనే ఒక భారీ హిట్ ఇచ్చిన దర్శకుడితో ఒక చిత్రం చేయబోతున్నాడు అని సమాచారం. ఇంతకి ఆ దర్శకుడు ఎవరో కాదు పరశురాం (బుజ్జి). ఈ దర్శకుడు మొన్నే గీత గోవిందంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు.

మొన్న గీత గోవిందం సక్సెస్ సమయంలోనే పరశురాం తో మళ్ళీ ఒక చిత్రం చేస్తాము అని గీత ఆర్ట్స్ ప్రకటించింది. ఇప్పుడు ఆ చిత్రమే ఇది అని తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరి ఈ హిట్ దర్శకుడు.. సుప్రీమ్ హీరో కి హిట్ ఇవ్వగలడా అనేది వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS