బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్స్ ఓవరాక్షన్ తారాస్థాయికి చేరుతోంది. గత సీజన్లలోనూ కొందరు అత్యుత్సాహం ప్రదర్శించినా, ఈ సీజన్‌లో మాత్రం ‘ఓవరాక్షన్ కా బాప్’ అనే స్థాయిలో రెచ్చిపోతున్నారు. నోరు పారేసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఎవరూ తమలోని ‘రియల్ యాంగిల్’ని చూపించడంలేదు. ‘స్టార్ట్, కెమెరా, యాక్షన్..’ అన్నట్లుగానే నడుస్తోంది కథ.
సోహెల్, అఖిల్, అబిజీత్.. ఇలా ఎవరికి వారు ఓవరాక్షన్‌లో తామే ‘తోపు’ అన్నట్లు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లో మెహబూబ్ దిల్ సే కూడా చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. రోబోట్స్ - హ్యామన్స్ టాస్క్‌లోనే రెచ్చిపోయిన మెహబూబ్, లక్కీగా పలుమార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడంతో కాన్ఫిడెన్స్ ఇంకా పెంచేసుకున్నాడో.. లేదంటే, బిగ్ బాస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయోగానీ, ‘పుచ్చె పగిలిపోతుంది..’ అంటూ వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు.
ఈ అన్ రియల్ ఓవరాక్షన్ కారణంగా బిగ్‌బాస్‌కి ఆడియన్స్ దూరమవుతున్నారని నిర్వాహకులు గుర్తించకపోవడం శోచనీయం. అయితే, ఇలాంటివన్నీ రియాల్టీ షోలలో కామన్.. అని కొందరు బిగ్‌బాస్ ఫాలోవర్స్ అభిప్రాయపడుతుండడం గమనించాల్సిన మరో అంశం. వాస్తవానికి, ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ అందరూ ప్రత్యేకమైన టాలెంట్స్ కలిగివున్నవారే. కానీ, ఎవరూ ఆ టాలెంట్స్‌ని ఉపయోగించుకోలేకపోతున్నారు. స్టార్ హోటల్ టాస్క్‌నే తీసుకుంటే, ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సయ్యింది.. అనసరపు ‘రొద’ ఎక్కువైపోయింది.