కొన్ని రోజుల క్రితం దర్శకుడు మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేస్తున్నారనే వార్తలతో మెగా ఫ్యాన్స్ కు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎందుకంటే మెహర్ రమేష్ కు పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం లభించింది కానీ అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో మెహర్ కు మరో సినిమా దర్శకత్వం వహించేే ఛాన్స్ దక్కలేదు. అలాంటప్పుడు చిరంజీవి సినిమా అవకాశం అంటే మాటలు కాదు కదా? అయితే దీనిపై తాజాగా కొంత క్లారిటీ వచ్చింది.
మెహర్ కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చిన మాట నిజమేనని, అయితే అది సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కాదని సమాచారం. ఆ రామ్ చరణ్ త్వరలో ఒక వెబ్ సిరీస్ ను నిర్మించే సన్నాహాలు చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించే బాధ్యతను మెహర్ రమేష్ కు అప్పజెప్పారు అని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆహా ప్లాట్ ఫామ్ కోసం రామ్ చరణ్ నిర్మిస్తున్నారట. అయితే ఈ వెబ్ సిరీస్ లో చిరంజీవి కూడా నటిస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది.
చరణ్ ఒకవైపు హీరోగా తన సత్తా చాటుతూనే సినిమా నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు. ఇప్పటికే నాన్నగారు చిరంజీవితో రెండు సినిమాలు నిర్మించిన చరణ్ మరోసారి 'ఆచార్య' సినిమాకు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలో వెబ్ సిరీస్ ల నిర్మాతగా కూడా మారనున్నాడు.