మెహ్రీన్‌కి ఈ రూటు వర్కవుటయ్యేనా.?

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ మెహ్రీన్‌ డెబ్యూ మూవీ 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'తో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసింది. తర్వాత ఈ భామకు తిరుగే లేదనుకుంటే, ఏడాది వరకూ ఎక్కడా కనిపించకుండా, ఆ తర్వాత వరుసపెట్టి క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసేసింది. వీటిలో ఏ ఒక్కటీ డెబ్యూ మూవీ అంత సక్సెస్‌ని మెహ్రీన్‌ ఖాతాలో వేయకపోయినా, అసలెప్పుడు ఈ భామ ఇన్ని సినిమాలు ఒప్పేసుకుందా.? అనే ఆశ్చర్యంలో ఆడియన్స్‌ని పడేసింది. 

ఒక్క ఏడాదిలో వరుసగా ఐదు సినిమాల్లో కనిపించేసి కాస్త బోరే కొట్టించేసిందిలెండి. ఇకపోతే ఈ ఏడాది మెహ్రీన్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో 'నోటా' సినిమాలో కనిపించింది. కానీ ఆ సినిమా సక్సెస్‌ కాలేదు సరికదా, మెహ్రీన్‌కి చీవాట్లు తప్ప మరేదీ మిగిల్చింది లేదు. ఇక రానున్న చిత్రం 'ఎఫ్‌ 2' పైనే మెహ్రీన్‌ ఆశలన్నీ. మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌కి జోడీగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్‌ చిత్రంలో మెహ్రీన్‌ సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్నా మరో హీరోయిన్‌. 

ఇదిలా ఉంటే, తాజాగా మెహ్రీన్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'కవచం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో చందమామ కాజల్‌ అగర్వాల్‌ వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌. చూస్తుంటే, మెహ్రీన్‌కి సోలో హీరోయిన్‌గా సక్సెస్‌లు రాకపోవడం చూసి, ఇలా డబుల్‌ హీరోయిన్‌ స్టోరీలను ఎంచుకుంటోందనిపిస్తోంది. సెలెక్టివ్‌గా ఒక్క సినిమా చేసి హిట్‌ కొట్టినా ఆ ఫేమ్‌ మరోలా ఉంటుంది. 

అయితే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా, మెహ్రీన్‌కి టైం కలిసి రావడం లేదు. చూడాలి మరి సంక్రాంతికి రాబోయే 'ఎఫ్‌ 2' అయినా మెహ్రీన్‌ని ఆదుకుంటుందేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS