పెళ్లయ్యాక అమ్మాయిల జీవితాలు మారిపోతాయి. ప్రాధాన్యతలు మారిపోతాయి. అప్పటి వరకూ... ఉన్న వ్యక్తిగత అభిరుచుల్ని కూడా భర్త కోసం పక్కన పెడతారు. అయితే... అమ్మాయిల ఇష్టాల్ని గౌరవించే భర్తలు లభిస్తే మాత్రం... వాళ్ల జీవితాలు హ్యాపీగా ఉంటాయి. మెహరీన్‌కీ అలాంటి తోడే దొరకబోతోంది. ఇటీవల మెహరీన్ పెళ్లి వార్తలు... టాలీవుడ్ అంతా షికారు చేస్తున్నాయి. హర్యానాకు చెందిన భవ్య బిష్ణోయిని మెహరీన్ పెళ్లి చేసుకోబోతోంది. ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మెహరీన్ కూడా తనకు కాబోయే భర్త గురించి చాలా గొప్పగా చెబుతోంది. ఎలాంటి భాగస్వామి కావాలని కలలు కన్నానో, అలాంటి వ్యక్తే తన జీవితంలోకి వస్తున్నాడని, ఇంతకంటే తాను కొత్తగా ఏం కోరుకోనని అంటోంది. పెళ్లయ్యాక సినిమాల్లో నటిస్తారా అంటే.. `తప్పకుండా` అని సమాధానం ఇచ్చింది. సినిమాల్లో నటించడానికి ఆయన ఓకే అనేశారు.. అంటూ సిగ్గుపడిపోయింది. సో.. మెహరీన్ టాలీవుడ్ కి టచ్‌లోనే ఉంటుందన్నమాట.